హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకృష్ణ ఆలయంలో జన్మాష్టమి వేడుకలకు ఏర్పాట్లు

అన్నమయ్య: గోవర్ధనగిరి అనపగుట్ట శ్రీకృష్ణ ఆలయంలో జన్మాష్టమి వేడుకలకు ట్రస్ట్ చైర్మన్ గురు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు సౌకర్యాలతో పాటు అభిషేకం, కళ్యాణోత్సవం, ఉట్ల ఉత్సవం, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.