హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మసీదు నిర్మాణానికి సాయం అందిస్తా: ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముస్లిం పెద్దలు, ముతవల్లీలతో సమావేశమయ్యారు. ఈ నెల 6న జరగనున్న 'మసీద్ ఏ షఫీ' శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించగా, అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నట్లు వెల్లడించారు. మసీదు నిర్మాణ స్థలాన్ని పరిశీలించి శంకుస్థాపనకు శుభాకాంక్షలు తెలిపారు. మసీదు నిర్మాణానికి తన వంతు సహాయసహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.