హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గుత్తి మునిసిపాలిటీ నూతన ఓటర్ల జాబితా విడుదల'

ATP: గుత్తి మున్సిపాలిటీ నూతన ఓటరు జాబితాను మున్సిపల్ కమిషనర్ సురేంద్ర గురువారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. గుత్తి మున్సిపాలిటీలో గతంలో 25 వార్డు ఉండగా 32 వార్డులుగా విభజన చేసిన తర్వాత 39, 009 మంది ఓటర్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు నూతన ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో సరి చూసుకోవాలని ప్రజలకు సూచించారు.