NTR: చందర్లపాడు మండలంలో పంట పొలాల్లోని మోటార్లకు విద్యుత్ స్తంభాల నుంచి ఏర్పాటు చేసిన సర్వీస్ వైర్లు చోరీకి గురవుతున్నాయి. తోటరావులపాడు, వెలది, కొత్తపాలెం, కొడవటికల్లు, ఉస్తేపల్లి, రామన్నపేట, బొబ్బిళ్లపాడు తదితర గ్రామాల్లో సుమారు వెయ్యి మీటర్ల వైర్లు చోరీకి గురైనట్లు రైతులు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు చందర్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ వైర్ల చోరీ ఘటనపై ఫిర్యాదు


