హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాయిబాబా మందిరానికి మకర తోరణం అందజేత

W.G: తాడేపల్లిగూడెం (M) నీలాద్రిపురంలో సాయిబాబా మందిరానికి గురువారం మకర తోరణం, హారతి పాత్రలను అందజేశారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మి దంపతులు బహూకరించారు. తొలుత సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ చౌదరి కుటుంబానికి బాబావారి ఆశీస్సులు కలగాలని మందిర అర్చకులు ఆకాంక్షించారు.