ప్రముఖ గుజరాతీ సంగీత దర్శకుడు గౌరాంగ్ వ్యాస్ కన్నుమూయడం పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి అవినాష్ వ్యాస్ వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీత ప్రపంచంలో ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆయన మృతి గుజరాత్‌కు తీరని లోటని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రధాని ప్రగాఢ సంతాపం తెలిపారు.
వార్తలు
ప్రముఖ సంగీత దర్శకుడు మృతి.. మోదీ దిగ్భ్రాంతి


