హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌కు అమెరికా మరోషాక్‌

అమెరికాలో గ్రీన్ కార్డుకోసం ఎదురు చూస్తున్న భారతీయులకు ఆ దేశ విదేశాంగశాఖ గట్టి షాక్ ఇచ్చింది. భారతీయులకు కేటాయించిన ఈబీ-1 గ్రీన్ కార్డ్ కోటా ఈ నెల 30తో ముగిసే ప్రమాదం ఉందని వీసా బులెటిన్ హెచ్చరించింది. భారీ డిమాండ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పింది. అమెరికాలో ఉద్యోగాలు చేసేవారికి ప్రతిభ ఆధారంగా గ్రీన్ కార్డ్ ఇప్పించేందుకు ఈబీ-1 వీసా ఉపయోగపడుతుంది.