హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌లో మరో కొత్త ఫ్లైఓవర్ ప్రారంభం

HYD: నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఒవైసీ జంక్షన్ వరకు రూ.620 కోట్లతో నిర్మించిన 3.23 కిలోమీటర్ల సిగ్నల్ ఫ్రీ కారిడార్ ఈరోజు నుంచే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇందులో 2.53 కిలోమీటర్ల సుదీర్ఘ ఫ్లెఓవర్, రెండు రాంప్లు ఉన్నాయి. నాలుగు లేన్ల మార్గంతో ప్రయాణ సమయం దాదాపు 30 నిమిషాలు తగ్గి, ఇంధనం ఆదా అవ్వడంతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.