హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపక్కనే బావి.. పొంచి ఉన్న ప్రమాదం

MDK: ఎల్కతుర్తి ఎన్‌హెచ్‌పై మండలంలోని పాతూర్ వద్ద రోడ్డు పక్కనే ప్రమాదకర బావి ఉంది. నిత్యం ఈ మార్గంలో వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. చోదకులు ఏ మాత్రం అజాగ్ర త్తగా వాహనాలు నడిపినా నేరుగా బావిలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. ఇక రాత్రి అయితే మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని చోదకులు కోరుతు న్నారు.