హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీలో ఘోరం.. అన్నంలో గన్నేరు ఆకులు!

WGL: అంగన్‌వాడీ టీచర్ నిర్లక్ష్యానికి ముగ్గురు పిల్లలకు అస్వస్థతకు గురైన ఘటన సత్తుపల్లి(M) కిష్టారంలో చోటు చేసుకుంది. పిల్లలకు వండిన ఆహారంలో గన్నేరు ఆకులు పడడంతో, వాటిని చూసుకోకుండా పిల్లలకు వడ్డించారు. అస్వస్థతకు గురవ్వడంతో విషయం బయటకు రాకుండా మూడు రోజులుగా ఖమ్మం ఆసుపత్రిలో వైద్యం అందించారు. ఆరోగ్యం విషమించడంతో తల్లిదండ్రుల ఆందోళన నిర్వహించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.