హైదరాబాద్: 28°C
వార్తలు

వీఐపీ కాన్వాయ్‌ కోసం.. పోలీసు అత్యుత్సాహం!

VIP కాన్వాయ్‌కు దారిచ్చేందుకు పోలీసు అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన ముంబైలో జరిగింది. కాన్వాయ్ కోసం ఓ వ్యక్తిని తోసి, అతని సైకిల్‌ను సదరు పోలీసు పక్కకు విసిరేశారు. ఈ ఘటనను శివసేన ఎంపీ మిలింద్ తీవ్రంగా ఖండించారు. VIP కాన్వాయ్ కోసం విధించిన ట్రాఫిక్ ఆంక్షల మధ్య సైకిల్‌పై వెళ్తున్న సామాన్యుడిపై దురుసుగా ప్రవర్తించడాన్ని తప్పుబట్టారు. పోలీసుపై చర్యలు తీసుకోవాలన్నారు.