హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలువలో దిగి నిరసన తెలిపిన BRS నేతలు

MHBD: ముడుపుగల్ వద్ద SRSP కాలువలోకి నేడు BRS నేతలు దిగి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని, రైతుల పంటల సాగుకు నీరు లేక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దేశానికి వెన్నెముక రైతు అని, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్నారు.