హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫీజు బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి'

JGL: పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం రాబోయే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుట్ల, మెట్‌పల్లి డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్‌కి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యంతో కళాశాలలు, అధ్యాపకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, విద్య, ఉపాధినిస్తున్న తమను చిన్నచూపు చూడవద్దన్నారు.