హైదరాబాద్: 28°C
వార్తలు

విచిత్ర దొంగ.. చోరీకి ముందు ఏంచేశాడంటే?

AP: అనంతపురం(D) ఉరవకొండ RTC బస్టాండ్ వద్ద బిగ్ బజార్‌లో గత నెల 31న రాత్రి చోరీ జరిగింది. షట్టర్‌ను ధ్వంసం చేసిన దొంగ లోపలికి వెళ్లి క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న వేంకటేశ్వరస్వామి చిత్రపటానికి నమస్కరించాడు. ఆ తర్వాత కౌంటర్‌లో నగదు తీసుకున్నట్లు CCTVలో కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.