WNP: కొత్తకోట బాలుర హైస్కూల్ ఆవరణలో రూ.4 లక్షల విరాళంతో వేదిక నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ పొగాకు విశ్వేశ్వర్ కుటుంబ సభ్యులు తమ తల్లిదండ్రులు బసమ్మ, జంబులింగం పేరుతో ఈ విరాళం ప్రకటించారు. ప్రధానోపాధ్యాయులు వివేకానంద శిలాఫలకం ఆవిష్కరించి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్‌ను ఉపాధ్యాయులు సన్మానించి అభినందించారు.
తెలంగాణ
VIDEO: కొత్తకోట హైస్కూల్‌లో వేదిక నిర్మాణానికి భూమిపూజ


