హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'బస్టాండ్ నిర్మించాలి'

ASF: సిర్పూరు(T) మండల కేంద్రంలో RTC బస్టాండ్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక షెడ్ ఉన్నా అక్కడికి బస్సులు వెళ్లకపోవడంతో నిరుపయోగంగా మారింది. కాగజ్ నగర్ నుంచి కౌటాల మీదుగా బెజ్జూరు, మార్గంలో రాకపోకలు సాగించే బస్సులు సిర్పూర్ మీదుగా ప్రయాణిస్తుంటాయి. ఇక్కడ రోడ్డుపైనే బస్సులు నిలుపుతున్నారు. అధికారులు స్పందించి బస్టాండ్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.