హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభానికి సిద్దమైన ఇందిరా మహిళా శక్తి భవనం

MDK: జిల్లా కేంద్రంలో రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం ప్రారంభానికి సిద్ధమైంది. కార్యాలయం, అధికారుల గదులు, వంటగది, భోజనశాలతోపాటు 100, 30 మంది సామర్థ్యంతో సమావేశ మందిరాలు, బహిరంగ వేదిక, వంద మందికిపైగా వసతి కల్పించే గదులు, ప్రత్యేక అతిథి గృహాన్ని నిర్మించారు. భవనాన్ని త్వరలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.