హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ పనులు పూర్తి.. రోడ్డు మరిచిన ఆర్‌అండ్‌బీ

RR: ఎల్బీనగర్‌ జోన్‌ చింతలకుంట పరిధిలోని ఇంజనీర్స్‌ కాలనీలో జీహెచ్‌ఎంసీ అధికారులు రెండు నెలల క్రితం డ్రైనేజీ పైప్‌లైన్‌ పనులు పూర్తి చేశారు. అయితే రోడ్డు పునరుద్ధరించాల్సిన ఆర్‌అండ్‌బీ అధికారులు ఇప్పటివరకు పట్టించుకోలేదు. దీంతో రాకపోకలకు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.