హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేపల వల చుట్టుకుని యువకుడు మృతి

MDK: మంజీరా నదిలో చేపల వేటకు వెళ్లిన యువకుడిని వలే కాలయముడై మింగేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన బోలా సాయిరణ్ (24) ఘనపూర్ ఆయకట్టు వద్ద నీటిలోకి దిగి వల నుంచి చేపలు వల తీస్తుండగా ప్రమాదవశాత్తూ కాళ్లకు వల చుట్టుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేక ఊపిరాడక మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.