MNCL: జన్నారం మండల కేంద్రంలోని కొత్తపేట ప్రధాన రహదారి పూర్తి గుంతలమయంగా మారింది. కొద్దిపాటి వర్షానికే రోడ్డు చిత్తడిగా మారి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. గుంతల్లో వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: గుంతలమయంగా ప్రధాన రహదారి


