హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

RR: ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డుపై బొంగలూరు టోల్ ప్లాజా ఎగ్జిట్ నెంబర్ 13 వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కూరగాయల లోడ్‌తో వెళ్తున్న మహీంద్ర బొలెరో వాహనం ముందు వెళ్తున్న టస్కర్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొనడంతో శివ అనే డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తన మామ నాగేశ్వర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.