హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాంకేతికతతో ప్రాణాలు కాపాడిన పోలీసులు

GNTR: నల్లచెరువుకు చెందిన శ్రీను అనే యువకుడు అదృశ్యమవ్వడంతో బుధవారం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం 2 గంటల్లోనే అతడు రైల్వే ట్రాక్‌ వద్ద ఆత్మహత్యాయత్నం చేస్తుండగా అడ్డుకున్నారు. విచారణలో ప్రేమ విఫలమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీను పోలీసులకు తెలిపాడు.