హైదరాబాద్: 28°C
తెలంగాణ

డివైడర్‌పైకి దూసుకెళ్లిన డీసీఎం

SRCL: బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి శివారులో డీసీఎం వ్యాన్ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌పైకి దూసుకెళ్లింది. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో వాహనం ముందు భాగం డివైడర్‌లో చిక్కుకుపోగా, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.