హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.32 లక్షలు రికవరీకి ఆదేశం

KNR: జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలో ఎనిమిది మంది ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. వారిపై సీడీఎంఏ చర్యలకు సిద్ధమైంది. ఒకరిపై వేటువేయగా మరో ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. WGL ఆర్‌డీఎం ఆదేశాలతో మున్సిపల్‌కు సంబంధించిన రూ.32 లక్షలు రికవరీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. స్థానిక పుర కమిషనర్‌ జి.మల్లికార్జున స్వామి నోటీసులు జారీ చేశారు.