హైదరాబాద్: 28°C
తెలంగాణ

 VIDEO: రోడ్డు ప్రమాదం.. వినాయక విగ్రహం ద్వంసం

SDPT: ధూల్‌పేట్ నుంచి సిద్దిపేటకు వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్‌పై ఆగిఉన్న లారీని వెనుక నుంచి మరొక లారీ ఢీకొట్టింది. దీంతో వినాయక విగ్రహం కిందపడి పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద దాటికి లారీతో పాటు ఓ కారు కూడా ధ్వంసం అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.