హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొల్లారంలో డిటోనేటర్ల కలకలం

HYD: బొల్లారం మద్రాస్ రెజిమెంట్ పరిసరాల్లో ఫైరింగ్ క్యాంప్ దగ్గర160 డిటోనేటర్లు లభ్యం అవ్వడం కలకలం రేపింది. బకెట్‌లో 8 డిటోనేటర్ల బండిల్స్‌ను ఉన్నట్లు సమాచారం. ఒక్కో బండిల్‌లో 20 డిటోనేటర్లు ఉన్నట్లు తెలిసింది. ఆయుధాల మిస్సింగ్ కేసులో బాంబు స్య్వాడ్‌తో తనిఖీలు చేస్తుండగా డిటోనేటర్లు బయటపడ్డాయి. దీనిపై బొల్లారంలో పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.