హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

MNCL: మంచిర్యాలలోని అశోక్ రోడ్ లో పేకాట స్థావరంపై బుధవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. తమకు అందిన సమాచారం మేరకు పట్టణ ఎస్సై రమేష్ తన సిబ్బందితో అక్కినపల్లి రవితేజ ఇంటిలో సోదా చేయగా పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.24 వేలు నగదు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట వంటి కార్యకలపాలపై కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు.