హైదరాబాద్: 28°C
తెలంగాణ

మలిదశ ఉద్యమకారుడు గీకురు రవీందర్ మృతి

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు, చిగురుమామిడి మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. చిగురుమామిడి సర్పంచ్, జడ్పీటీసీగా ప్రజలకు సేవలందించారు. ఆయన మృతిపై కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు.