హైదరాబాద్: 28°C
తెలంగాణ

కర్రెగుట్టల్లో ఐఈడీ పేలి వ్యక్తి మృతి

MLG: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వెంకటాపురం మండలం ఏదుల్లాచెరువు కాలనీకి చెందిన మడకం నాగేశ్వరరావు (55) వెదురు బొంగుల కోసం కర్రెగుట్టల అటవీ ప్రాంతానికి వెళ్లగా ఐఈడీ పేలి మృతి చెందారు. ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఐఈడీని ఎవరు అమర్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.