హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు రక్షణ కల్పించాలని అదనపు కలెక్టర్‌కు వినతి

WNP: మహిళలకు రక్షణ కల్పించాలని హిందూ వాహిని జిల్లా నాయకులు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా కన్వీనర్ అరుణ్ గౌడ్ మాట్లాడుతూ.. తుక్కుగూడలో శిరీషపై జరిగిన అత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని నాయకులు పాల్గొన్నారు.