హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎదిరలో భక్తిశ్రద్ధలతో పొట్ట పండగ

MLG: వెంకటాపురం మండలంలోని ఎదిరలో నిన్న ఆదివాసీలు పొట్ట పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పగిడిద్దరాజు ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామున ఇళ్లను శుద్ధి చేసుకుని వరికంకులు, కూరగాయలు, సాములు, కొర్రలు, జొన్నలు, మొక్కజొన్న కంకులను తెచ్చి మేళతాళాలతో ఆలయానికి చేరుకుని పంటలను సమర్పించారు. తలపతి పర్శిక తిరుపతిరావు, రాజు, వీరయ్య తదితరులు ఉన్నారు.