హైదరాబాద్: 28°C
తెలంగాణ

జపాన్ విద్యా పర్యటనకు మురళీకృష్ణ

వనపర్తి జిల్లా నుంచి జపాన్ విద్యా పర్యటనకు ఏకైక ఉపాధ్యాయుడిగా పెబ్బేరు మండలం యాపర్ల ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ పి. మురళీకృష్ణ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయనను సన్మానించారు. రాష్ట్రం నుంచి 29 మంది ఉపాధ్యాయులు, 11 మంది విద్యాశాఖ అధికారులు ఈ నెల 5 నుంచి 12 వరకు జపాన్‌లో పర్యటించనున్నారు.