హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ నేరాల పట్ల జాగ్రత్త: మర్రిపూడి SI

ప్రకాశం: సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని మర్రిపూడి ఎస్సై సుదర్శన్ బుధవారం సాయంత్రం అన్నారు. సెల్ ఫోన్లకు వచ్చే లింకులను ఓపెన్ చేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతున్నారనే విషయం ప్రజలు గమనించాలన్నారు. గ్రామాల్లో ఒంటరిగా పొలాల్లో సంచరించే మహిళలు కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచించారు.