ASF: ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ పై ఈనెల 5న సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు న్యాయవాదులు, బీమా ప్రతినిధులతో, మధ్యాహ్నం 12 గంటలకు పోలీసు, ఆబ్కారీ, అటవీ అధికారులతో సమావేశాలు జరుగుతాయన్నారు. కేసులను రాజీమార్గంలో పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
తెలంగాణ
ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్


