MHBD: నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి పడమటి చెరువు నల్లరాళ్ల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అక్కడ కనిపించినట్లు స్థానికులు తెలిపారు. అడవి జంతువుల కోసం అమర్చినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. బుధవారం వాటిని తాకడంతో ఓ శునకం పేలి మృతి చెందింది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.
తెలంగాణ
మేచరాజుపల్లిలో పేలుడు పదార్థాల కలకలం


