హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోమాతకు కన్నీటి వీడ్కోలు!

KMR: మహమ్మద్‌నగర్ మండలం నర్వలో గోమాత మృతి చెందడంతో గ్రామస్తులు హిందూ సంప్రదాయబద్ధంగా ఘనంగా అంతిమయాత్ర నిర్వహించారు. భజన సంకీర్తనలు, దైవభక్తి పాటలతో గోమాతకు వీడ్కోలు పలికారు. గ్రామంలోని వీధుల గుండా అంతిమయాత్ర కొనసాగగా గ్రామస్తులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గోమాతకు సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.