హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PHNగా పదవీ విరమణ చేసిన స్వర్ణలతకు సన్మానం

BPT: చిన్నగంజాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో PHNగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన కాకర్లముడి స్వర్ణలతను వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు. గత 34 ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో అందించిన సేవలను కొనియాడారు. మెడికల్ ఆఫీసర్లు పి. సాయి శ్రీచరణ్, సిహెచ్. సిరివెన్నెల, కె. కీర్తి సరోజ్ తదితరులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.