కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఇక నిర్మాణ ఖర్చు భారం కానుంది. ఈనెల 5 నుంచి సిమెంట్ తయారీ కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. బస్తాపై రూ.30 నుంచి రూ.40 వరకు పెంచాలని నిర్ణయించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇది అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు 10% వరకు పెరగనున్నాయి. ముడిసరుకు, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు పెరగడమే పెంపునకు కారణమని తెలుస్తోంది.
వ్యాపారం
ఇల్లు కట్టుకునే వారికి షాక్!


