WGL: సంగెం, గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, చింతల్ సబ్‌సెంటర్‌ను డీఎంహెచ్‌ఓ డా. రాజారెడ్డి బుధవారం తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వ్యాక్సినేషన్ రికార్డులను పరిశీలించి చిన్నారులు, గర్భిణులకు సకాలంలో టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలను ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్‌ఓ తనిఖీలు


