హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం మత్తులో తండ్రి గొంతుకోసిన కొడుకు

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం మాణిక్య రాయనిపల్లిలో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. భర్త రోజూ మద్యం సేవించి ఇంటికి వస్తున్నాడని కోడలు మామకు చెప్పడంతో తండ్రి, కుమారుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన కుమారుడు తండ్రి గొంతు కోసి హతమార్చినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.