తూ.గో: ఏలూరు కోర్టు రాజమండ్రి ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ గొర్రెల వేణుగోపాల్‌కు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 3 లక్షల జరిమానా విధించింది. 2018లో ఏలూరుకు చెందిన ఓ మహిళ చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశారు. కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో మూడు నెలల కిందట ఎన్బీడబ్ల్యూ జారీ అయింది. నల్లజర్లలో అతన్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం తీర్పు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్
చెక్ బౌన్స్ కేసులో డిప్యూటీ రేంజర్‌కు జైలు శిక్ష


