ASR: జిల్లాలోని పాడేరు పట్టణం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో18 ప్రిన్సిపల్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గత నెలలో ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణ, ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. ఇప్పటికే తుది జాబితా విడుదల చేయాల్సి ఉన్నా.. వివిధ సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. సమగ్ర శిక్షా ఏపీసీ స్వామినాయుడు మాట్లాడుతూ.. మూడురోజుల్లో తుది జాబితా విడుదల చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
త్వరలో తుది జాబితా విడుదల


