హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

నిజామాబాద్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 1080.10 అడుగుల నీటిమట్టంతో ప్రాజెక్టులో 45.161 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో 2,720 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 933 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 36.039 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరిందన్నారు.