ELR: జంగారెడ్డిగూడెం మండలంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ ప్రాజెక్టులో బుధవారం సుమారు 40 కిలోల భారీ శీలావతి చేప వలకు చిక్కింది. కొంగువారిగూడెంకు చెందిన మత్స్యకారుడు సత్తిబాబు వేటకు వెళ్లగా చేప చిక్కినట్లు తెలిపారు. ఇంత భారీ చేప గతంలో ఎప్పుడూ పట్టుబడలేదని స్థానికులు పేర్కొన్నారు. చేపను రూ. 10 వేలకు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారుడి చిక్కిన భారీ చేప


