హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో మహిళ యువతీ మృతి

KMM: తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన చామకూరి శిరీష(24) బుధవారం మేడపై బంధువులతో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గమనించిన కుటుంబీకులు తిరుమలాయపాలెం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త,ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిరీష అకస్మిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.