BPT: చీరాల మార్కెట్‌లో నిత్యవసర సరుకులు, కూరగాయలతో పాటు నిమ్మకాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. డజను నిమ్మకాయలు ధర రూ.100 - 120 పలకడంతో నిమ్మకాయలను కొనే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో ప్రతికూల వాతావరణం వల్ల తోటలలో నిమ్మ దిగుబడి గణనీయంగా పడిపోయిందని, అందువల్ల నిమ్మ ధర పెరిగిందని వ్యాపారులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
కొండెక్కిన నిమ్మకాయల ధరలు


