హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విలేకరులకు అండగా ఉంటాం: అంబటి మురళి

GNTR: పెదకాకానిలో వైఎస్సార్ వర్ధంతికి హాజరైన అంబటి మురళిని బుధవారం స్థానిక విలేకరులు కలసి తమ ఇళ్ల స్థలాల సమస్యను వివరించారు. 2014 నుంచి స్థానిక ఎమ్మెల్యే హామీలకే పరిమితమయ్యారని తెలిపారు. దీనిపై స్పందించిన అంబటి మురళి.. నియోజకవర్గ విలేకరులందరికీ న్యాయం చేస్తానని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు.