BHNG: హైదరాబాద్ మూసాపేటకు చెందిన భక్తులు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు బుధవారం కారును కొండకింద పార్కింగ్‌లో నిలిపారు. తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు కారు అద్దం పగులగొట్టి రూ.50 వేల నగదు, అరతులం బంగారం చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు. యాదగిరిగుట్టలో వరుస చోరీలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
దర్శనానికి వస్తే.. కారు అద్దాలు పగులగొట్టి చోరీ


