హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: జిల్లా కలెక్టర్

తూ.గో: చిన్నారుల ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి వైద్య సేవలు అందించేందుకు 'మై చైల్డ్ హెల్త్' కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లాలో 1,798 అంగన్వాడీ కేంద్రాల్లో 30,467 మంది, 1,142 ప్రభుత్వ పాఠశాలల్లో 98,091 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. శారీరక, మానసిక సమస్యలకు సహాయం అందిస్తామన్నారు.