హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికలు

శ్రీకాకుళం నగరంలోని టౌన్‌హాల్‌ వేదికగా గురువారం రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు సంఘ జిల్లా కార్యదర్శి జోగిపాటి వంశీ తెలిపారు. అండర్-10, 12 విభాగాల క్రీడాకారులు సాయంత్రం 4 గంటలకు హాజరుకావాలన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన వారు ఈ నెల 6న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విషయాన్ని గమనించాలన్నారు.